
న్యూస్

ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ హర్మూజ్ జలసంధి నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్‌ను కొత్త దశకు తీసుకెళ్తామని ప్రకటిస్తూ, ఇకపై మరింత వ్యూహాత్మకంగా, కఠిన విధానంతో ముందుకు సాగుతామని సంకేతాలు ఇచ్చారు. చమురు రవాణాకు కీలకమైన ఈ జలసంధిపై ఇరాన్ నియంత్రణను బలోపేతం చేసే దిశగా ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, హర్మూజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గలేదని తెలుస్తోంది. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని స్పష్టం చేసిన ఖమేనీ, తమ హక్కుల విషయంలో మాత్రం వెనక్కి తగ్గబోమని తెలిపారు. ఇటీవల జరిగిన దాడుల్లో జరిగిన నష్టాలకు పరిహారం కోరుతామని, దేశ ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!