

తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పులకు నాంది పలుకుతామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఈ నెల 25 రాష్ట్ర చరిత్రను, భవిష్యత్తును మార్చే రోజు అవుతుందని అన్నారు. కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలను ఈ గడ్డకు పరిచయం చేస్తామని, సామాన్యుల చేత, సామాన్యుల కోసం, సామాన్యులే చేసే రాజకీయాలను తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యలపై ప్రశ్నిస్తూ, పోరాడుతూ పరిష్కారాలు సాధిస్తామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రతిపక్షం రెండూ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని కవిత విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ‘ఏటీఎం’గా ఉపయోగిస్తోందని ఆరోపిస్తూ, రియల్ ఎస్టేట్, హైడ్రా పేర్లతో ప్రజలపై ఒత్తిడి తీసుకువస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వంగి పనిచేస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో స్పందించడం లేదని విమర్శించారు. తెలంగాణ జాగృతి తరఫున కొత్త రాజకీయ అజెండాతో ముందుకు వస్తామని, ప్రజల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని కవిత స్పష్టం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!