
గాసిప్స్

ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో ఉన్న వేదాంత గ్రూప్ పవర్ ప్లాంట్‌లో జరిగిన ఘోర పేలుడు ఘటనపై కేసు నమోదు అయింది. ఈ కేసులో వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ సహా పలువురి పేర్లు చేర్చారు. ఈనెల 14న సింగితరాయ్ ప్లాంట్‌లో జరిగిన ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులు మృతి చెందగా, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
దాబ్రా పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 106, 289, 3(5) కింద కేసు నమోదు చేసినట్లు శక్తి జిల్లా ఎస్పీ ప్రఫుల్ ఠాకూర్ తెలిపారు. చైర్మన్‌తో పాటు 8 నుంచి 10 మంది పేర్లు ఎఫ్ఐఆర్లో ఉన్నాయని వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, అవసరమైతే మరికొంతమందిపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ నివేదికలు రావాల్సి ఉండగా, పేలుడు కారణాలపై నిపుణులతో కూడిన సాంకేతిక బృందం విచారణ చేపడుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!