

తెలుగు సినిమా రంగంలో చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ అగ్రస్థానంలో ఉన్న ప్రముఖ నటులు. ఎన్నో దశాబ్దాలుగా వీరు ప్రేక్షకులను అలరిస్తూ, పరిశ్రమను ముందుకు తీసుకెళ్తున్నారు. అరవై సంవత్సరాలు దాటినా కూడా సినిమాలు చేస్తూ యువ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరిద్దరి మధ్య సినిమా పరంగా పోటీ ఉన్నా, వ్యక్తిగతంగా మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించాలని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు కానీ అది ఇంకా సాధ్యం కాలేదు.
ఇప్పుడేమో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన తిమ్మరాజుపల్లి టీవీ సినిమాపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా 1990ల కాలాన్ని ఆధారంగా తీసుకుని గ్రామీణ నేపథ్యంతో రూపొందింది. ఈ రోజు ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తక్కువ ఖర్చుతో మంచి సినిమాలు నిర్మిస్తూ కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు కిరణ్ అబ్బవరం.
ఇటీవల ఈ సినిమాలో చిరంజీవి, బాలకృష్ణ కనిపించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా ప్రారంభంలో బాలకృష్ణ, చివర్లో చిరంజీవి కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే వారు నిజంగా కనిపిస్తారా లేదా వారి పోస్టర్లు, డైలాగులు మాత్రమే ఉంటాయా అన్నది తెలియాల్సి ఉంది. ఈ వార్తలతో సినిమా మీద ఆసక్తి మరింత పెరిగింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!