

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకు భారత సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించి, ఇది నిధుల మళ్లింపు ఆరోపణలకు సంబంధించినదని పేర్కొంటూ ఈ దశలో జోక్యం చేసుకోవడం సముచితం కాదని స్పష్టం చేసింది.
అయితే బ్యాంకులు జారీ చేసిన షోకాజ్ నోటీసులపై హైకోర్టు సింగిల్ జడ్జి ముందు వాదనలు వినిపించుకునే అవకాశం అంబానీకి కల్పించింది. అలాగే ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని హైకోర్టుకు సూచించింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2024 మార్గదర్శకాల ప్రకారం, అంబానీ మరియు రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు సంబంధించిన రుణ ఖాతాలను బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్‌లు మోసపూరితంగా వర్గీకరించాయి. ఈ నిర్ణయంపై హైకోర్టు ముందుగా తాత్కాలిక స్టే ఇచ్చిన విషయం తెలిసిందే.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!