
గాసిప్స్

ప్రఖ్యాత గ్లోబల్ ఇన్వెస్టర్ మార్క్ మొబియస్ (89) న్యూయార్క్లో కన్నుమూశారు. భారత్తో పాటు వర్థమాన దేశాల స్టాక్ మార్కెట్లపై అపార నమ్మకం కలిగిన ఆయన, 2021లో భారత స్టాక్ మార్కెట్ 50 ఏళ్ల పాటు ర్యాలీ కొనసాగుతుందని చేసిన వ్యాఖ్యలు విశేష చర్చకు దారితీశాయి.
మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అర్థశాస్త్రం, రాజకీయ శాస్త్రాల్లో పీహెచ్డీ పూర్తి చేసిన మొబియస్కు ప్రపంచ మార్కెట్లలో 50 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. భారత్, చైనా వంటి ఆసియా మార్కెట్లతో పాటు రష్యా, వెనెజువెలా మార్కెట్లపైనా ఆయనకు గట్టి పట్టు ఉంది. ఇటీవలి వరకు టెంపుల్టన్ ఎమర్జింగ్ మార్కెట్స్ గ్రూప్లోచా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సేవలందించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!