

అమరావతిలో వచ్చే నెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు జోరందుకున్నాయి. మొత్తం నాలుగు స్థానాలు కూటమికే దక్కే అవకాశం ఉండటంతో పంచాయితీ వేడెక్కింది. సంఖ్యాబలం ప్రకారం తెలుగుదేశం పార్టీకు రెండు, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలకు చెరో స్థానం ఇవ్వాలని భావిస్తున్నప్పటికీ, టీడీపీ మాత్రం మూడు స్థానాలపై పట్టుబడుతోంది.
టీడీపీ, బీజేపీల్లో ఆశావహుల జాబితా పెద్దదిగా ఉండగా, జనసేనలో కొత్త పేర్లు వినిపించడం ఆసక్తి రేపుతోంది. టీడీపీ కోటాలో ప్రస్తుత ఎంపీ సానా సతీశ్ బాబుకు కొనసాగింపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అలాగే కృష్ణ ఎల్లా, రామకృష్ణ, కిలారు రాజేష్, షరీఫ్, కోనేరు సురేష్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరోవైపు బీజేపీ తరఫున అన్నామలై, నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి పేర్లు వినిపిస్తుండగా, జనసేన నుంచి లింగమనేని రమేశ్, టీజీ విశ్వప్రసాద్ ముందంజలో ఉన్నారు. మొత్తంగా నాలుగు స్థానాల కోసం కూటమిలో పోటీ తీవ్రరూపం దాల్చింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!