
సినిమాలు

కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2026 పై అవగాహన కల్పించేందుకు ఇన్కమ్ ట్యాక్స్ విభాగం మైగవ్ పోర్టల్‌తో కలిసి దేశవ్యాప్తంగా ట్యాక్స్ క్విజ్ పోటీని ప్రారంభించింది. ఈ కొత్త చట్టం పాత 1961 ఆదాయపు పన్ను చట్టాన్ని భర్తీ చేసింది. పన్ను విధానాన్ని సరళీకరించడం, ఫారాల సంఖ్యను తగ్గించడం, అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు మరియు పన్ను చెల్లింపుదారులు అందరూ ఇందులో పాల్గొనవచ్చు.
ఈ క్విజ్ 2026 మార్చి 20 న ప్రారంభమై ఈ నెల 20 వరకు కొనసాగుతుంది. ఇందులో 10 ప్రశ్నలు ఉంటాయి మరియు ఒక్కసారి మాత్రమే పాల్గొనాలి. నెగెటివ్ మార్కింగ్ ఉండదు. మొదటి 10 మందికి రూ.10,000 చొప్పున, తదుపరి 20 మందికి రూ.5,000 చొప్పున, ఆ తర్వాత 50 మందికి రూ.3,000 చొప్పున నగదు బహుమతులు అందిస్తారు. పాల్గొన్న అందరికీ సర్టిఫికెట్ కూడా ఇవ్వబడుతుంది.







.jpeg&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!