

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో జరుగుతున్న ఉద్రిక్తతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో జరిగిన యుద్ధం కేవలం రెండు నెలలే కొనసాగిందని, అమెరికా గతంలో చేసిన యుద్ధాలు సంవత్సరాల పాటు సాగాయని చెప్పారు. తాము సైనిక చర్యకు దిగకపోయి ఉంటే చెడు పరిణామాలు చోటుచేసుకునేవని పేర్కొన్నారు. త్వరలోనే విజయాన్ని సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇక టెహ్రాన్‌లో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశముందని ట్రంప్ తెలిపారు. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగింపుపై ఇంకా స్పష్టత లేకపోయినా, ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉందన్నారు. అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని మరోసారి స్పష్టం చేస్తూ, శుద్ధి చేసిన యురేనియాన్ని అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని తెలిపారు. ఇదే సమయంలో లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేలా తానే ముందుండి సహకరించానని, ఇప్పటివరకు మొత్తం 10 యుద్ధాలను ఆపానని ట్రంప్ వెల్లడించారు.





_1775900374811.jpg&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!