

లెజెండరీ నటి మధుబాల జీవిత కథను తెరపైకి తీసుకురావడానికి బాలీవుడ్లో భారీ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్న ఈ బయోపిక్కు జస్మీత్ కె.రీన్ దర్శకత్వం వహిస్తున్నారు. మధుబాల పాత్ర కోసం సరైన నటిని ఎంపిక చేసే ప్రక్రియలో కియారా అద్వానీ, సారా అర్జున్ పేర్లు వినిపించినప్పటికీ, చివరికి కళ్యాణి ప్రియదర్శన్ ఈ అవకాశాన్ని దక్కించుకుందని టాక్ వినిపిస్తోంది. ‘లోకా చాప్టర్ 1’తో వచ్చిన గుర్తింపు ఆమెకు ఈ ప్రాజెక్ట్‌లో కీలకంగా మారిందని చెబుతున్నారు.
మధుబాల పాత్రలో కనిపించే అమాయకత్వం, క్లాసిక్ లుక్ కళ్యాణిలో సహజంగా ఉన్నాయని భావించిన భన్సాలీ టీమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ బయోపిక్ భావోద్వేగాలకు ప్రాధాన్యతనిచ్చే చిత్రంగా రూపొందనుండగా, కళ్యాణి తన నటనతో ఆ పాత్రను ఎలా ఆవిష్కరిస్తుందో అనే ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో కూడా ఈ ఎంపికపై పాజిటివ్ చర్చలు జరుగుతున్నాయి.




















.jpeg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!