

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి చరిత్ర సృష్టించాడు. చైనాలోని నింగ్బో వేదికగా జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో సెమీఫైనల్లో ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ ఛాంపియన్ కున్లావుత్ వితిద్సార్న్ (థాయ్‌లాండ్)ను ఓడించి ఆయన ఫైనల్‌కు చేరాడు. మొదటి సెట్‌ను 10-21తో కోల్పోయినప్పటికీ, అద్భుతమైన పోరాట పటిమతో తిరిగి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చివరికి 10-21, 21-19, 21-17 తేడాతో విజయం సాధించాడు.
మూడు సెట్లలో జరిగిన ఈ హోరాహోరీ సెమీస్‌లో తొలి సెట్లో ఓడిన తర్వాత కూడా ఆయుష్ శెట్టి అద్భుతంగా పుంజుకుని వరుసగా రెండు సెట్లు గెలిచి ఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు. ఈ విజయంతో ఆయన అరుదైన ఘనత సాధించాడు. ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరిన రెండో భారత షట్లర్‌గా ఆయుష్ నిలిచాడు. 1965లో దినేశ్ ఖన్నా తర్వాత ఈ ఘనత సాధించిన భారత ఆటగాడిగా ఆయన పేరు నమోదు చేసుకున్నాడు. ఫైనల్లో విజయం సాధిస్తే, ఈ టోర్నమెంట్‌ను గెలిచిన తొలి భారత షట్లర్‌గా ఆయుష్ చరిత్ర సృష్టించనున్నాడు.



















.jpeg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!