

కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ-ఆంధ్ర విభజనను ఇండియా-పాకిస్తాన్ విభజనతో పోల్చిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కేటీఆర్, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని అలాంటి విభజనతో పోల్చడం మూర్ఖత్వమని, అహంకారపూరిత వ్యాఖ్యలని ఖండించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించినందుకు తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదే విషయంపై హరీష్ రావు కూడా తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దశాబ్దాల పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజల త్యాగాల ఫలితమని పేర్కొన్నారు. అలాంటి మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమేనని, అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించడమేనని విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా చేసిన ఈ వ్యాఖ్యలపై తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!