
గాసిప్స్

స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్స్ భారత్‌లో తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మోడల్‌ను బట్టి గరిష్టంగా రూ.1 లక్ష వరకు ధరలు పెరుగుతాయని కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త ధరలు మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, సరఫరా అంతరాయాలు, రూపాయి పతనం కారణంగా ఇన్పుట్ ఖర్చులు భారీగా పెరిగాయని సంస్థ తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఉత్పత్తి మరియు ఆపరేషన్ వ్యయాలు పెరగడంతో ధరలను సవరించడం తప్పనిసరి అయిందని వోల్వో పేర్కొంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!