
సినిమాలు

బిహార్ రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన నితీష్ కుమార్ ఈ రోజు ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభాధ్యక్షుడి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం బిహార్ రాజకీయాల్లో కీలక మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు.
రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత నితీష్ కుమార్ త్వరలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశముంది. ఈ నెల 9వ తేదీన ఆయన తన సన్నిహితులతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 13 లేదా 14వ తేదీల్లో ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టడంతో నితీష్ కుమార్ ఒక అరుదైన ఘనతను సాధించారు. భారతదేశంలో శాసనసభ, శాసన మండలి, లోక్ సభ, రాజ్యసభ అనే నాలుగు సభలలో సభ్యుడిగా ఉన్న కొద్దిమంది నాయకుల్లో ఆయన ఒకరిగా నిలిచారు.
.jpeg)





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!