

అమెరికా ఇరాన్‌పై సముద్ర దిగ్బంధనానికి దిగడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ ఓడరేవులు, తీర ప్రాంతాల వద్ద అమెరికా నౌకాదళం కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది. ఈ నిర్ణయం వల్ల ఆ దేశానికి నౌకల రాకపోకలు దాదాపు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ పరిణామం మరింత ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ చర్యపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాల్లోని రేవులకు కూడా రాకపోకలు అడ్డుకుంటామని హెచ్చరించింది. ఈ దిగ్బంధనంతో ఇరాన్ ఆర్థికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతుందని భావిస్తున్నారు. మరోవైపు, ఈ ఉద్రిక్తతల కారణంగా ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొని, ఏ క్షణాన పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశముందని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!