

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా తరచుగా దాహం వేయడం సహజం. ఈ సమయంలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే చాలా మంది వేడి లేదా గోరువెచ్చని నీళ్లు తాగడానికి ఇష్టపడకుండా, ఫ్రిజ్‌లోని చల్లటి నీళ్లు లేదా ఐస్ వాటర్ వైపు మొగ్గు చూపుతారు. చల్లటి నీరు తక్షణ చల్లదనాన్ని అందించినప్పటికీ, అధికంగా తాగితే జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా భోజనం తర్వాత చల్లటి నీరు తాగడం వల్ల జీర్ణక్రియ నెమ్మదించి, అజీర్ణ సమస్యలు రావచ్చు. శరీర అంతర్గత ఉష్ణోగ్రతను ఒక్కసారిగా తగ్గించడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా అవరోధం కలుగుతుంది.
ఇక గోరువెచ్చని లేదా సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న నీళ్లు తాగడం శరీరానికి మేలు చేస్తుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా రక్తప్రసరణను సక్రమంగా ఉంచి, శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం వేసవిలో చాలా చల్లటి లేదా చాలా వేడి నీటికి బదులుగా గోరువెచ్చని నీళ్లు తాగడం ఉత్తమం. ముఖ్యంగా బయట నుంచి వచ్చి వెంటనే చల్లటి నీళ్లు తాగడం మానుకోవాలి. డీహైడ్రేషన్‌ను నివారించడానికి రోజుకు కనీసం 2.5 నుంచి 3 లీటర్ల నీరు తాగాలి. ఎక్కువగా చెమట పట్టే వారు మరింత నీరు తీసుకోవడం మంచిది. అదనంగా పండ్ల రసాలు, కొబ్బరి నీరు వంటి ద్రవాలను కూడా తీసుకోవడం ఆరోగ్యానికి ఉపయోగకరం.
గమనిక : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య సలహాగా పరిగణించకండి. ఆహారంలో మార్పులు చేయడానికి ముందు డాక్టర్లను సంప్రదించండి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!