
న్యూస్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. నగరానికి వచ్చిన ఆయన, నేడు పార్టీ అధినేత కేసీఆర్‌ను కలవనున్నారు. ఈ నెల 27న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ సమావేశం నిర్వహణపై చర్చలు జరగనున్నాయి.
ఇదే సమయంలో, మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలసి బీఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలు, కొత్త చేరికలపై కేసీఆర్‌తో జరిగే సమావేశం తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పార్టీ భవిష్యత్ వ్యూహాలపై ఈ సమావేశం కీలకంగా మారనుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!