
సినిమాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లో టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఎండీ టిమ్ రైఫిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ భారత్‌లో C-130J సూపర్ హెర్క్యులస్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేసే ప్రణాళికలను వివరించింది. అలాగే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌తో కలిసి F-16 వింగ్స్ తయారీపై కూడా చర్చలు జరిగాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్నట్లు టిమ్ రైఫిల్ తెలిపారు.
ఇంకా, ఘనా దేశ హైకమిషనర్ క్వాసి ఒబిరి-డాన్సో కూడా ముఖ్యమంత్రిని కలిశారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన, ఘనా మరియు తెలంగాణ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని కోరారు. విద్య, సాంకేతికం, ఆరోగ్యం, వాణిజ్య రంగాల్లో సహకారం పెంచాలని సూచించగా, సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!