

తెలంగాణ మంత్రి సీతక్క, కేసీఆర్ కు లీగల్ నోటీసు జారీ చేశారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో నిరాధార ఆరోపణలు చేస్తూ, తన ప్రతిష్టను దెబ్బతీసేలా బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా ద్వారా పోస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నోటీసును రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ఆమె తరఫున అడ్వకేట్ నాగులూరి కృష్ణ కుమార్ పంపించారు. ఈ కొనుగోలు ప్రక్రియను Telangana Technology Services Limited నిర్వహించిందని, టెండర్ ఇవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారం కాంట్రాక్ట్ ఇవ్వబడిందని, ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని సీతక్క స్పష్టం చేశారు.

రూ.44 కోట్ల టెండర్‌లో రూ.30 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం పూర్తిగా ఆధార రహితమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి కేసీఆర్ బాధ్యత వహించాలని, 48 గంటల్లో పోస్టులు తొలగించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!