
టెక్నాలజీ

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గల్ఫ్‌లో చిక్కుకుపోయిన తెలుగువారిని స్వదేశానికి తీసుకురావడానికి ప్రత్యేక విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. తాత్కాలిక కాల్పుల విరామం నేపథ్యంలో జజీరా ఎయిర్వేస్ సౌదీ అరేబియాలోని దమ్మమ్ నుంచి విజయవాడకు ఈనెల 13 నుంచి 29 వరకు ప్రత్యేక సర్వీసులు నడపనుంది. సోమ, బుధ, శుక్రవారాల్లో ఈ విమానాలు నడవనున్నాయి. విజయవాడ విమానాశ్రయ అధికారులకు ఇప్పటికే స్లాట్ కేటాయించారు. దమ్మమ్ నుంచి కువైట్‌కు కూడా సర్వీసులు విస్తరించే అవకాశం ఉంది.
అలాగే ఫ్లై91 విజయవాడ–హైదరాబాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు శుక్రవారం నుంచి ప్రారంభించనుంది. ఉదయం 7.30 గంటలకు విమానం బయలుదేరుతుంది. విజయవాడ విమానాశ్రయం 2025–26 ఆర్థిక సంవత్సరంలో 14.14 లక్షల మంది ప్రయాణికులతో మంచి వృద్ధిని నమోదు చేసింది. మొత్తం 17,533 విమానాల రాకపోకలు నమోదయ్యాయి.







.webp&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!