

కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్‌లో నిర్మాణంలో ఉన్న రిఫైనరీ ప్రాజెక్ట్ ఖర్చును భారీగా పెంచేందుకు ఆమోదం ఇచ్చింది. ముందుగా సుమారు రూ.43,129 కోట్లుగా అంచనా వేసిన ఈ ప్రాజెక్ట్ వ్యయం ఇప్పుడు రూ.79,459 కోట్లకు పెరిగింది. హెచ్‌పీసీఎల్ కూడా అదనంగా రూ.8,962 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దేశంలో చమురు శుద్ధి, పెట్రోరసాయన రంగాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్‌లోని పచ్పదరా ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోంది.
ఈ ప్రాజెక్ట్ వల్ల ఇప్పటికే సుమారు 25,000 మందికి ఉద్యోగాలు లభించాయి. ఏప్రిల్ 21న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు. సంవత్సరానికి 9 మిలియన్ మెట్రిక్ టన్నుల శుద్ధి సామర్థ్యం, 2.4 మిలియన్ మెట్రిక్ టన్నుల పెట్రోరసాయన ఉత్పత్తి సామర్థ్యం ఈ ప్రాజెక్ట్‌కు ఉంది. అదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్‌లో రూ.40,150 కోట్లతో రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. పునరుత్పాదక విద్యుత్ అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!