

ప్రకృతి మనకు ఎన్నో ఉపయోగకరమైన పండ్లు, ఆకుకూరలు, ఔషధ గుణాలు ఉన్న మొక్కలను అందిస్తుంది. వాటిలో పుదీనా ఒకటి. ఇంట్లో పుదీనా మొక్కలను పెంచుకుంటే ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. పుదీనా ఆకుల్లో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉండి, వాటిని వంటల్లో ఉపయోగిస్తే రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అలాగే పుదీనా ఆకులతో డీటాక్స్ నీళ్లు తయారు చేసుకోవచ్చు. మన శరీరంలో ఆహార వ్యర్థాలు, మందుల ద్వారా వచ్చిన రసాయనాలు టాక్సిన్లుగా పేరుకుపోతాయి. వీటిని బయటకు పంపించడానికి అప్పుడప్పుడు శరీరానికి డీటాక్సిఫికేషన్ అవసరం. ఒక గాజు సీసాలో పుదీనా ఆకులు, చక్రాల్లా తరిగిన నిమ్మకాయ ముక్కలు వేసి నీళ్లు పోసి, కొంతసేపటి తర్వాత ఆ నీటిని తాగితే శరీరం తేలికగా అనిపించి అలసట తగ్గుతుంది.
పుదీనా ఆకులకు ఆయుర్వేదంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఉదయాన్నే పరగడుపున పుదీనా నీళ్లు తాగితే రోజంతా శక్తివంతంగా ఉండవచ్చు. ఇవి శరీరంలో నీటి సమతౌల్యాన్ని నిలబెట్టి డీహైడ్రేషన్‌ను నివారిస్తాయి. పుదీనా నీళ్లు తాగడం వల్ల శరీరం తాజాగా ఉండటంతో పాటు తలనొప్పి, అలసట తగ్గుతాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా వేసవిలో పుదీనా నీళ్లు తాగడం వల్ల చెమట దుర్వాసన తగ్గి, శరీరం ఉల్లాసంగా ఉంటుంది.
గమనిక : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య సలహాగా పరిగణించకండి. ఆహారంలో మార్పులు చేయడానికి ముందు డాక్టర్లను సంప్రదించండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!