

ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు ఆరోగ్యానికి హానికరం అనేది తెలిసిందే. ముఖ్యంగా అధిక రక్తపోటు ఉన్నవారు ఉప్పు తక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. అయితే మనకు ఆరోగ్యకరంగా అనిపించే కొన్ని ఆహారాలలో కూడా ‘దాగి ఉన్న సోడియం’ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ hidden sodium శరీరంలో నెమ్మదిగా పేరుకుపోయి, దీర్ఘకాలంలో రక్తపోటు మరియు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఉప్పు రుచి స్పష్టంగా తెలియకపోయినా, మనం రోజూ తీసుకునే కొన్ని ఆహారాల్లో గణనీయమైన సోడియం ఉంటుంది. ఉదాహరణకు, చాలామంది ఆరోగ్యకరంగా భావించే చపాతీలో కూడా 150 నుంచి 230 మిల్లీగ్రాముల వరకు సోడియం ఉంటుంది. అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాల్లో కూడా ఉప్పు ఎక్కువగా ఉండి, అవి ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.
నిపుణుల ప్రకారం, ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. కానీ చాలా మంది తెలియకుండానే దీనికంటే ఎక్కువ ఉప్పును ఆహారంలో తీసుకుంటున్నారు. బ్రెడ్, తృణధాన్యాలు వంటి ఆహార పదార్థాల ద్వారా కూడా శరీరంలోకి అదనపు సోడియం చేరుతోంది. దీనివల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉండగా, ఇప్పటికే బీపీ సమస్యలు ఉన్నవారికి మరింత ప్రమాదం కలగవచ్చు. కాబట్టి ఆరోగ్యకరంగా కనిపించే ఆహారాల్లో కూడా దాగి ఉన్న సోడియాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. ఆహారం తీసుకునే ముందు ప్యాకెట్‌పై ఉన్న లేబుల్‌ను పరిశీలించడం, ఉప్పు పరిమాణాన్ని గమనించడం వంటి అలవాట్లు పెంచుకుంటే, బీపీ మరియు గుండె సంబంధిత సమస్యలను నివారించవచ్చు.
గమనిక : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య సలహాగా పరిగణించకండి. ఆహారంలో మార్పులు చేయడానికి ముందు డాక్టర్లను సంప్రదించండి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!