

ప్రముఖ కథానాయకుడు రామ్ చరణ్ ప్రముఖ పత్రిక ఎస్క్వైర్ ఇండియా కవర్ పేజీపై మెరిసి తన వ్యక్తిగత, వృత్తి జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తండ్రిగా, భర్తగా, నటుడిగా తన బాధ్యతలను సమతుల్యం చేస్తూ ప్రస్తుతం ఆనందంగా ఉన్నానని చెప్పారు. తన కుమార్తె క్లీంకారనే తన ప్రపంచమని చెబుతూ తండ్రి అయిన తర్వాత జీవితం పూర్తిగా మారిపోయిందని వెల్లడించారు.
షూటింగ్ ఎంత కష్టంగా ఉన్నా ఇంటికి వెళ్లిన వెంటనే పిల్లలతో గడపడానికే ప్రాధాన్యం ఇస్తానని రామ్ చరణ్ తెలిపారు. తన పెంపుడు కుక్క రైమ్ తన అలసటను పోగొడుతుందని చెప్పారు. ఆర్ఆర్ఆర్ ద్వారా వచ్చిన అంతర్జాతీయ గుర్తింపు తనపై బాధ్యతను పెంచిందని, మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయాల్సిన బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు.
తన తదుపరి చిత్రం పెద్ది కోసం దాదాపు ఏడాదిన్నరగా కఠోర శిక్షణ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ పాత్ర కోసం కుస్తీ నేర్చుకుంటున్నానని వెల్లడించారు. తండ్రి చిరంజీవి నుంచి క్రమశిక్షణ, కష్టపడే తత్వం నేర్చుకున్నానని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి ప్రారంభించిన అయ్యప్ప దీక్ష తన ఆలోచనలను నియంత్రించడంలో సహాయపడిందని తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!