
న్యూస్

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసే ముందు సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తున్నారు. అన్నేమార్గ్-1లో ఉన్న సీఎం నివాసం నుంచి, అన్నేమార్గ్-7 సర్క్యులర్ రోడ్డులో కొత్తగా కేటాయించిన బంగ్లాకు శనివారం కొంత సామగ్రిని తరలించినట్లు సమాచారం.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ త్వరలో సీఎం పదవి నుంచి వైదొలగనున్నారని తెలుస్తోంది. ఈ నెల 13 లేదా 14 తేదీల్లో ఆయన రాజీనామా చేసే అవకాశం ఉండగా, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఈ నెల 15 న జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!