

రష్యా చమురు ఎగుమతులకు కీలకమైన ఉస్త్ లుగా నౌకాశ్రయంపై ఉక్రెయిన్ మరోసారి డ్రోన్ దాడి చేసింది. వారం క్రితం జరిగిన దాడిలో ఈ పోర్టు ఇప్పటికే దెబ్బతినడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. తాజాగా జరిగిన దాడితో మరింత నష్టం సంభవించినట్లు సమాచారం. లెనిన్‌గ్రాడ్ ప్రాంత గవర్నర్ ఈ దాడిని ధృవీకరిస్తూ పలువురు డ్రోన్లను కూల్చినట్లు తెలిపారు.
బాల్టిక్ సముద్ర ప్రాంతంలో ఉన్న ఈ పోర్టు రష్యా చమురు ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తోంది. సముద్ర మార్గంలో జరిగే చమురు రవాణాలో దాదాపు 45% ఈ ప్రాంతం నుంచే జరుగుతుందని అంచనా. రోజుకు సుమారు 1.72 మిలియన్ బ్యారెళ్ల చమురు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతోంది. ప్రిమోర్స్క్ పోర్టు కూడా ఇటీవల దాడుల్లో దెబ్బతినడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఉన్న సమయంలో ఈ దాడులు రష్యా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ రష్యా ఇంధన రంగాన్ని లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు కొనసాగిస్తోంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతున్నాయి.





















.webp&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!