

తెలంగాణ కేబినెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఈ రోజు సాయంత్రం సమావేశమైంది. సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గిగ్ వర్కర్ల బిల్లులకు, ఎంప్లాయ్ పేరెంట్ వెల్ఫేర్ బిల్లులకు , అడ్వొకేట్ ప్రొటెక్షన్ బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే హేట్ స్పీచ్ ప్రొటెక్షన్ అంశంపై కూడా కేబినెట్ చర్చించింది.
కులగణనపై స్వతంత్ర నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను కూడా ఆమోదించింది. ఇంకా రోహిత్ వేముల చట్టానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సబ్ కమిటీకి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షత వహించనుండగా, సభ్యులుగా దామోదర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఉంటారు. తల్లిదండ్రుల మద్దతు బిల్లుకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలు రాష్ట్రంలో సంక్షేమం మరియు సామాజిక రక్షణకు దోహదపడనున్నాయి.






.jpeg&w=3840&q=75)



.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!