

తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కే. చంద్రశేఖర్ రావు కుటుంబం దోపిడీకి పాల్పడిందని మాత్రమే కాకుండా, దీనిపై ప్రధాని, కేంద్ర హోంశాఖ కూడా వ్యాఖ్యానించిందన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మి కేసును సీబీఐకి అప్పగించామని సీఎం పేర్కొన్నారు. 48 గంటల్లో చర్యలు తీసుకుంటామని చెప్పినా నెలలు గడిచినా పురోగతి కనిపించలేదని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లాభాల కోసం ఈ కేసును నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.
ఇక మాజీ మంత్రి హరీష్ రావు తమ్ముడు మహేశ్ రావుపై కూడా సీఎం ఆరోపణలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ధరణి పోర్టల్‌ను ఉపయోగించి వందల ఎకరాల భూములను అక్రమంగా బదలాయింపు చేసుకున్నారని తెలిపారు. దీనిపై హరీష్ రావు అంగీకరిస్తే హౌస్ కమిటీ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!