

ఉక్రెయిన్పై రష్యా మరోసారి భారీస్థాయిలో దాడులకు దిగింది. 24 గంటల్లో సుమారు 1,000 డ్రోన్లను ప్రయోగిస్తూ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇదే అతిపెద్ద గగనతల దాడిగా నమోదైంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపిన ప్రకారం, దేశంలోని 550కు పైగా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఇందులో 541 డ్రోన్లను ఉక్రెయిన్ దళాలు కూల్చివేశాయి. క్షిపణి దాడుల్లో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
ఇవానో-ఫ్రాంకివ్స్క్ ప్రాంతంలో ప్రసూతి ఆస్పత్రి సమీపంలో జరిగిన దాడిలో ఓ సైనికుడు మరియు అతని కుమార్తె మృతి చెందడం విషాదకరం. వందలాది నివాస గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలు దెబ్బతిన్నాయి. ఈ దాడులు రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ముగించాలనే ఉద్దేశం లేకుండా తీవ్రతరం చేస్తున్నారని జెలెన్స్కీ ఆరోపించారు. మాస్కోపై కఠిన ఆంక్షలు విధించాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు.
.webp&w=3840&q=75)







.jpeg&w=3840&q=75)









.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!