

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ పరిశ్రమ స్థాపనకు శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమ 20 నెలల్లో “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంలో ఏర్పాటు చేయబడిందని అన్నారు. పరిశ్రమ ద్వారా నేరుగా, పరోక్షంగా లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రాజెక్టు సాకారం కోసం కృషి చేసిన ఆదిత్య మిట్టల్, మంత్రి నారాలోకేష్‌లకు అభినందనలు తెలిపారు. భూమి ఇచ్చిన రైతులకు కూడా ధన్యవాదాలు తెలిపారు.
రెండు దశల్లో నిర్మించబడే ఈ పరిశ్రమ 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయగలదని, ₹11,198 కోట్ల విలువైన క్యాప్టివ్ పోర్ట్, నాలుగు లేన్ జాతీయ రహదారి, ముడి ఇనుము సరఫరా కోసం పైప్‌లైన్ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు ఉంటాయని తెలిపారు. ఉక్కు ఉత్పత్తి తో పాటు, విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఆర్థిక కార్యకలాపాలతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందనుంది. విశాఖలో కొత్త పరిశ్రమలు, డేటా సెంటర్స్, పోర్టులు, ఎయిర్ పోర్టులు, రేర్ ఎర్త్ ప్రాజెక్టులు కూడా విశాఖను ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారుస్తాయని తెలిపారు.
కేంద్ర మంత్రి హెచ్.డీ. కుమార స్వామి మాట్లాడుతూ, చంద్రబాబు-పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా మారిందని, ఈ ప్రాజెక్ట్ దేశీయ ఉక్కు ఉత్పత్తి, సూక్ష్మ చిన్న మరియు మధ్యస్థ వ్యాపారాలుకు (ఎంఎస్ఎంఈ) మద్దతు, ఉద్యోగాల సృష్టికి తోడ్పడుతుందని చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరిశ్రమను వేగంగా నిర్మించడానికి పూర్తి సహకారం అందిస్తున్నాయని హామీ ఇచ్చాయి.












.webp&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!