
న్యూస్

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా 9 ఏళ్లుగా నిలిచిన బాహుబలి 2 రికార్డును ఈ చిత్రం అధిగమించినట్లు సమాచారం. విడుదలైన 10 రోజుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.
ఈ నేపథ్యంలో ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ, తాను సినిమా చూసి ఎంతో ఆస్వాదించానని తెలిపారు. కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తూ అన్ని రికార్డులు బద్దలుకొడుతున్నందుకు చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే రూ.1,200 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.








.jpg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!