

‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రకటించిన IE100 అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 25వ స్థానంలో నిలిచారు. గతేడాది 28వ స్థానంలో ఉన్న ఆయన ఈసారి మూడు స్థానాలు ఎగబాకడం విశేషం. రాష్ట్రంలో రెండేళ్ల పాలన పూర్తి చేసిన నేపథ్యంలో ఆయన ప్రభావం మరింత పెరిగినట్లు నివేదిక పేర్కొంది.
రాష్ట్రంలో కుల గణన నిర్వహణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీ వంటి నిర్ణయాలు ఆయన నాయకత్వాన్ని బలపరిచాయి. అంతర్గత వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రజాదరణను నిలుపుకున్నారని విశ్లేషించారు. జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీతో సాన్నిహిత్యం కూడా ఆయనకు కీలకంగా మారింది.
ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా వరుసగా మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. కాంగ్రెస్ నేతలు ప్రియాంకా గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే కూడా జాబితాలో చోటు దక్కించుకోగా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ 55వ స్థానంలో నిలిచారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!