
న్యూస్

జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారు. దేశవ్యాప్తంగా మొత్తం 26 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా, అందులో ఏపీ మరియు తెలంగాణకు చెందిన 10 మంది చోటు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రోషణ్ మణిదీప్ రెడ్డి, నరేంద్రబాబు గారి మహిత్, టి. దుర్గా సుప్రభాత్, పసల మోహిత్, బిజ్జం వెంకట చంద్రశేఖర్ రెడ్డి అత్యుత్తమ ప్రదర్శనతో 100 పర్సంటైల్ సాధించారు. అలాగే తెలంగాణకు చెందిన మంథా శివకామేశ్, భవితేష్ రెడ్డి, సాయిరుత్విక్ రెడ్డి, వివన్ శరద్ మహేశ్వరి, రిషి ప్రేమ్‌నాథ్ కూడా పూర్తి పర్సంటైల్ సాధించి ప్రతిభ చాటారు.
ఈ ఫలితాలతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మరోసారి జాతీయ స్థాయిలో తమ సామర్థ్యాన్ని నిరూపించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!