
న్యూస్

ఐవేర్ బ్రాండ్ లెన్స్‌కార్ట్పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘స్టాఫ్ యూనిఫాం అండ్ గ్రూమింగ్ గైడ్’ పేరుతో వైరల్ అవుతున్న డాక్యుమెంట్‌లో హిందూ సంప్రదాయాలైన బిందీ, తిలకంపై నిషేధం విధిస్తూ, హిజాబ్ వంటి మతపరమైన దుస్తులకు అనుమతి ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది. ఈ అంశంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదంపై కంపెనీ సీఈఓ పీయూష్ బన్సాల్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, వైరల్ అవుతున్న పత్రం పాతదని, ప్రస్తుత విధానాలను ప్రతిబింబించదని తెలిపారు. ఉద్యోగులకు బిందీ, తిలకం ధరించడానికి పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేస్తూ, కలిగిన గందరగోళానికి క్షమాపణలు కోరారు. సంస్థ అన్ని సంస్కృతులను గౌరవిస్తుందని పునరుద్ఘాటించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!