
న్యూస్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , బీఆర్‌ఎస్ నాయకుడు T. హరీష్ రావు పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకోవడానికే హరీశ్ రావు రహస్యంగా ఢిల్లీకి వెళ్లారని ఆయన ఆరోపించారు. బీజేపీ నాయకులను కలుసుకుని విచారణను నిలిపివేయడానికి ప్రయత్నిస్తున్నారని కూడా రేవంత్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో ఎవరిని కలిశారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పై మాట్లాడుతూ, లక్ష ఎకరాలకు కూడా నీరు అందించలేకపోయిన పరిస్థితి ఉందని అన్నారు. అయినప్పటికీ, బ్యారేజీలను మరమ్మతులు చేసి రైతులకు నీరందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా, ఈ కేసులో తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!