

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన నటుల్లో అల్లు అర్జున్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా, నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా సినీ రంగంలోకి వచ్చిన బన్నీ, విజేత (1985) లో బాలనటుడిగా కనిపించి, గంగోత్రి (2003) తో హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. వారసత్వం ఉన్నప్పటికీ, తన ప్రత్యేకమైన డాన్స్, స్టైల్, నటనతో ఐకాన్ స్టార్ గా ఎదిగిన ఆయన ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా నిలిచారు. గత కొన్నేళ్లలో అల వైకుంఠపురములో, పుష్ప: ది రైజ్, పుష్ప 2: ది రూల్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా రూ. 2,361 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించారు. ముఖ్యంగా పుష్ప 2 అలొనె రూ. 1,700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ సంచలనం సృష్టించింది.
జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న టాలీవుడ్ స్టార్‌గా కూడా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇతర హీరోలలా ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ తీసుకోకుండా, బన్నీ రెవెన్యూ షేరింగ్ మోడల్‌ను అనుసరిస్తున్నారు. సినిమా మొత్తం వసూళ్లలో 30 శాతం వాటా తీసుకునే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానం వల్ల నిర్మాతలపై ముందస్తు భారం తగ్గుతుంది. సినిమా హిట్ అయితే బన్నీకి భారీ ఆదాయం వస్తుంది, కానీ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా నిర్మాతకు పెద్ద నష్టం ఉండదు.
ఈ లెక్కల ప్రకారం పుష్ప: ది రైజ్ ద్వారా సుమారు రూ. 105 కోట్లు, పుష్ప 2 ద్వారా దాదాపు రూ. 500 కోట్లకు పైగా ఆయన అందుకున్నట్టు సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది భారతీయ సినీ చరిత్రలో ఒక హీరో అందుకున్న అత్యధిక పారితోషికాల్లో ఒకటిగా భావిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ గ్లోబల్ మార్కెట్‌పై దృష్టి పెట్టారు. దర్శకుడు అట్లీతో కలిసి రాకా చిత్రంలో నటిస్తున్నారు. సుమారు రూ. 800 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందా అనే ఆసక్తి నెలకొంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!