
న్యూస్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23 న ఒకే దశలో జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి కాగా, ప్రచారం కూడా ముగింపు దశకు చేరుకుంది. ఈసారి ఎన్నికల్లో మొత్తం 4,023 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో కోటీశ్వరుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తాజా ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం, 981 మంది అభ్యర్థులు రూ.5 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారు. అదేవిధంగా, క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల సంఖ్య కూడా పెరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. రాజకీయ రంగంలో ఆర్థిక స్థితి మరియు వివాదాస్పద నేపథ్యం కలిగిన అభ్యర్థుల సంఖ్య పెరగడం చర్చనీయాంశంగా మారింది.
ఇక టీవీకే పార్టీ అధినేత విజయ్ ఆస్తుల పరంగా రెండో స్థానంలో ఉన్నారని నివేదిక వెల్లడించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!