
సినిమాలు

అమెరికా–ఇరాన్ మధ్య మరో దశ శాంతి చర్చలు సోమవారం (ఏప్రిల్ 20) పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఇరుదేశాల ప్రతినిధులు ఆదివారం నాటికి ఇస్లామాబాద్‌కు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని చర్చలతో సంబంధం ఉన్న ఇరాన్ అధికార వర్గాలు వెల్లడించినట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఇక ఇదే సమయంలో హర్మూజ్ జలసంధిపై ఇరాన్ మళ్లీ ఆంక్షలను అమల్లోకి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాపై ఒత్తిడి పెంచడమే కాకుండా తమ ఓడరేవులపై జరుగుతున్న ముట్టడిని అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు రాబోయే చర్చలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!