
న్యూస్

ఢిల్లీ పర్యటనలో ఉన్న బీఆర్‌ఎస్ త్రిసభ్య బృందం ప్రముఖ సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరంతో సమావేశమైంది. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సూచనల మేరకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కలిసి ఈ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం కమిషన్‌కు సంబంధించిన హైకోర్టు తీర్పు త్వరలో వెలువడనున్న నేపథ్యంలో, తదుపరి న్యాయపరమైన అవకాశాలపై చర్చించారు. అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయించే అంశంపై కూడా సమగ్రంగా పరిశీలించారు.
అదేవిధంగా, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై సీనియర్ న్యాయవాదితో విస్తృతంగా చర్చించారు.



.png&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!