
న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ సంఘం నాయకుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిని సేవల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన సచివాలయంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వెంకట్రామిరెడ్డి గతంలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా, అలాగే ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. గత 22 నెలలుగా ఉద్యోగుల సమస్యల పై ప్రశ్నలు లేవనెత్తుతూ, ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు.
ప్రత్యేకంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయనపై సస్పెన్షన్ విధించగా, ఇప్పుడు శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉత్తర్వులు ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు రోజునే వెలువడటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!