

సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఓ క్రేజీ వార్త అందింది. గాయం కారణంగా ఐపీఎల్ నుంచి దూరంగా ఉన్న ఆస్ట్రేలియా స్టార్ బౌలర్, ఎస్ఆర్హెచ్ కీలక ఆటగాడు ప్యాట్ కమిన్స్ ఈ నెల జట్టుతో తిరిగి చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాజస్థాన్ రాయల్స్‌ను సొంత మైదానంలో ఓడించిన తర్వాత హైదరాబాద్ జట్టు మంచి ఫామ్‌లో కొనసాగుతోంది. అరంగేట్ర బౌలర్లు ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటుండగా, కమిన్స్ రాకతో జట్టుకు మరింత బలం చేకూరనుంది.
గాయం కారణంగా ఈ సీజన్లో ఇప్పటివరకు ప్యాట్ కమిన్స్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. బుధవారం ఆస్ట్రేలియాలో అతనికి ఫిట్నెస్ పరీక్ష జరగనుంది. అందులో విజయవంతమైతే ఆయన త్వరలోనే హైదరాబాద్ జట్టులో చేరే అవకాశం ఉంది. ప్రారంభ మ్యాచ్‌లకు దూరమైనప్పటికీ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశమూ ఉంది. గత సీజన్లో కమిన్స్ నాయకత్వంలో ఎస్ఆర్హెచ్ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కమిన్స్ గైర్హాజరీలో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ జట్టును నడిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ జట్టు రెండు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!