

ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. 2047 నాటికి అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వం సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం విధానాలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్పేస్‌టెక్ సంస్థ స్కైరూట్ అభివృద్ధి చేసిన ‘విక్రమ్-1’ ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ప్రయోగం కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాకెట్‌కు సంబంధించిన పరికరాలను హైదరాబాద్ నుంచి శ్రీహరికోటకు పంపే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు.
రాకెట్ రూపకల్పన, అభివృద్ధి పూర్తిగా హైదరాబాద్‌లోనే జరగడం గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. 2022లో తొలి ప్రయోగం చేసిన సంస్థ, తక్కువ కాలంలోనే ఉపగ్రహ ప్రయోగ స్థాయికి చేరుకోవడం గొప్ప విజయమని కొనియాడారు. తెలంగాణలో ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి నమోదైందని, ముఖ్యంగా విమాన విడిభాగాలు, రక్షణ పరికరాల ఎగుమతులు పెరిగాయని తెలిపారు.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని సీఎం వెల్లడించారు. నైపుణ్య విశ్వవిద్యాలయం, అధునాతన సాంకేతిక కేంద్రాల ఏర్పాటు, పాలిటెక్నిక్ కళాశాలల ఉన్నతీకరణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. విద్యా వ్యవస్థలో కూడా మెరుగుదల కోసం సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!