

బజాజ్ తన కొత్త పల్సర్ NS400Z బైక్‌ను 350cc ఇంజిన్‌తో విడుదల చేసింది. దీని ధర దిల్లీలో ఎక్స్‌షోరూమ్ వద్ద ఒక లక్ష తొంభై మూడు వేల రూపాయలుగా నిర్ణయించారు. గతంలో ఈ బైక్‌లో 373cc ఇంజిన్ ఉండేది. ఇప్పుడు 349.13cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అందించారు. ఇది 9000 ఆర్‌పీఎం వద్ద 40 బీహెచ్‌పీ శక్తిని, 7500 ఆర్‌పీఎం వద్ద 33.2 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
డిజైన్ విషయానికి వస్తే పెద్ద మార్పులు లేవు. స్పోర్ట్స్ స్టైల్, స్ట్రీట్ ఫైటర్ లుక్, పదునైన బాడీ ప్యానెల్స్‌తో యువతను ఆకట్టుకునేలా రూపొందించారు. ముందువైపు అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్, వెనుక మోనో షాక్ సస్పెన్షన్ ఉన్నాయి. భద్రత కోసం డ్యూయల్ ఛానెల్ ఏబిఎస్, మల్టిపుల్ రైడ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇచ్చారు.
ఈ బైక్‌లో 17 అంగుళాల వీల్స్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఎల్‌సీడీ కన్సోల్ కూడా ఉంది. మొత్తంగా బజాజ్ అదే డిజైన్‌ను కొనసాగిస్తూ పనితీరు మరియు ఫీచర్లను మరింత మెరుగుపరిచింది.






.png&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!