

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ప్రారంభానికి ముందే పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. సంక్రాంతికి వచ్చిన ‘మన శంకరవరప్రసాద్’ విజయంతో ఊపు మీద ఉన్న చిరంజీవి, దర్శకుడు బాబీతో కొత్త ప్రాజెక్ట్‌ను త్వరగా ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ, అనేక కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. ముఖ్యంగా నిర్మాతల విషయంలో నెలకొన్న అనిశ్చితి ఈ ప్రాజెక్టును సందిగ్ధంలోకి నెట్టింది.
ఈ చిత్రాన్ని నిర్మించాల్సిన నిర్మాత వెంకట్ కె నారాయణ గతంలో నిర్మించిన కొన్ని సినిమాలు అనుకున్న ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఒత్తిడులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాజెక్టులు విడుదల వాయిదా పడడం, వివాదాలు ఎదురవడం వంటి సమస్యలు ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టాయి. దీంతో చిరంజీవి సినిమా నిర్మాణ బాధ్యతలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నుంచి నిర్మాత తప్పుకున్నారన్న వార్తలు వినిపిస్తుండగా, మరో నిర్మాత భాగస్వామిగా చేరే అవకాశం ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ పరిస్థితుల్లో చిరంజీవి-బాబీ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో అనే అంశంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!