
న్యూస్

పోలవరం ప్రాజెక్టు రెండో దశ పూర్తి చేయడానికి సుమారు రూ.32 వేల కోట్ల వ్యయం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు జలవనరుల శాఖ సమగ్ర నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మే 1న ఢిల్లీలో జలశక్తి శాఖ కార్యదర్శికి సమర్పించనున్నట్లు సమాచారం.
రెండో దశలో భాగంగా పునరావాసం, సహాయక చర్యల కోసం పెద్ద మొత్తంలో నిధులు అవసరమవుతున్నాయి. ఇందుకోసం రూ.21 వేల కోట్లు కేటాయించాల్సి ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. అదనంగా నెట్వర్క్ కాల్వల నిర్మాణానికి రూ.5,400 కోట్లు అవసరమని అంచనా వేశారు.
ప్రాజెక్టులో నావిగేషన్ సదుపాయాల కోసం రూ.4,350 కోట్లు అవసరమని, ఇతర ఖర్చులు కూడా ఇందులో చేర్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ దశను పూర్తి చేయడానికి భారీ ఆర్థిక సహాయం అవసరమని ప్రభుత్వం కేంద్రానికి వివరించనుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!