
న్యూస్

హైదరాబాద్‌లోని 24 క్రాఫ్ట్స్ కార్యాలయంలో ఎన్నికల హడావుడి నెలకొంది. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌కు సంబంధించిన ఈ ఎన్నికలు సినీ కార్మికుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అధ్యక్ష పదవికి అనిల్ వల్లభనేని, చిట్టినేని కిషోర్ మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
ప్రధాన కార్యదర్శి పదవికి ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలవడంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. సభ్యులు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉద్యోగుల భవిష్యత్ దిశను నిర్ణయించనున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!