
న్యూస్

టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర ఈరోజు హైదరాబాద్‌లోని హిమయత్ నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు స్థానిక అధికారులు సాదర స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయంలోని సమాచార కేంద్రం, కళ్యాణ మండపం, కార్యాలయం, అతిథి గృహం వంటి సౌకర్యాలను పరిశీలించారు. భక్తులకు అందిస్తున్న సేవలు, వాటి ధరలు, నిర్వహణ విధానం మరియు ఆన్‌లైన్ ద్వారా సేవలను సులభతరం చేసే అంశాలపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని త్రాగునీరు, సౌకర్యవంతమైన క్యూ లైన్లు, పరిశుభ్రత వంటి ఏర్పాట్లు మెరుగుపరచాలని సూచించారు.















.webp&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!