
న్యూస్

భద్రాచలం శ్రీరామాలయంలో అభివృద్ధి పనుల మొదటి దశకు నేడు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా కళావాహన కార్యక్రమంతో పాటు ఆలయ జీర్ణోద్ధరణ పనులు ప్రారంభం కానున్నాయి. కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. ఆలయం చుట్టూ దేవతామూర్తులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి చిన్నజీయర్ స్వామి హాజరుకానున్నారు. ఇప్పటికే ఆయన రామాలయానికి చేరుకుని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఉదయం కళావాహన కార్యక్రమంతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు ఆలయ అభివృద్ధిలో కీలక దశగా భావిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం భద్రాచలం ఆలయ అభివృద్ధికి మొత్తం రూ.351 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా మొదటి విడతలో రూ.180 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ పనులతో ఆలయ పరిసరాలు మరింత అభివృద్ధి చెందుతాయని అధికారులు పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!