
క్రీడలు

శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకోని పరిస్థితిలో ఉన్న కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు గారి అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మాజీ సీఎం కుమారుడు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను ఫోన్ ద్వారా సంప్రదించి పరామర్శించారు. ఈ దుఃఖాన్ని తట్టుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే భాస్కరరావు గారి సేవలను స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!