

నటుడు శర్వానంద్ హీరోగా, దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న ‘భోగి’ సినిమా కోసం రంపచోడవరం అటవీ ప్రాంతంలో భారీ యాక్షన్ సీన్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా యూనిట్ అక్కడే లొకేషన్లు చూసుకుంటోంది. “షర్వా సంపత్ బ్లడ్ ఫెస్ట్” అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ ఏర్పడింది. ఈ సినిమా శర్వానంద్ కెరీర్లోనే చాలా మాస్, రగ్గడ్ స్టైల్లో ఉండబోతుందని తెలుస్తోంది.
ఈ యాక్షన్ సీన్‌ను స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ డిజైన్ చేస్తున్నారు. అడవి బ్యాక్‌డ్రాప్‌లో రా, నేచురల్ స్టైల్లో ఈ సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.



















.jpg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!